మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (19:54 IST)

తానా అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్షులు ఉయ్యూరుకు రాక‌

అమెరికాలోని తానా సంస్థకు చెందిన నూతన అధ్య‌క్ష ఉపాధ్య‌క్షులు ఉయ్యూరుకు వ‌చ్చారు. ఉయ్యూరు లోని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ స్వగృహంలో తానా సంస్థ ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్. వైస్ ప్రెసిడెంట్ పుట్టగుంట సురేష్ రాజేంద్ర ప్రసాద్ ని కలిశారు. భవిష్యత్తులో ఉయ్యూరు,  ప‌రిసర గ్రామాలకు తానా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు.
 
తానా నూతన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లను శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అమెరికాలో తెలుగువారికి చెందిన ప్రముఖ తానా సంస్థ అతి ప్రాముఖ్యమైనదని చెప్పారు. నిరంజన్ ది ఉయ్యూరు ప్రక్కన కడవకొల్లు గ్రామం, సురేష్ ది గోపువాని పాలెం అని, మన పరిసర గ్రామ బిడ్డలు ఈ స్థాయికి వచ్చారంటే దానికి మనందరం కూడా  సంతోషించాల‌న్నారు. రాబోయే రోజుల్లో ఉయ్యూరు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తానా  సంస్థ ద్వారా అందిస్తామని చెప్పడం సంతోషం అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తానా ద్వారా అమెరికాలో కూడా చాటాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
 
నిరంజన్ , సురేష్ మాట్లాడుతూ.  అమెరికా వచ్చినప్పుడల్లా మన తెలుగువారి తరుపున తానా సంస్థ ద్వారా చేపట్టే  ఆయన్ను అనేక కార్యక్రమాలకి ఆహ్వానించే వారమని, మన తెలుగు ప్రజలకు సేవ చెయ్యాలని మా తానా సంస్థ సంకల్పమని, రాబోయే రోజుల్లో  ఉయ్యూరు, పరిసర గ్రామ ప్రజలకు మా వంతుగా తప్పకుండా సేవా కార్యక్రమాలు అందిస్తామని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు జంపన వీర శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు రాజులపాటి ఫణి, మీసాల అప్పలనాయుడు, జంపాన తేజ, దుర్గాప్రసాద్, దూపం శివ తదితరులు పాల్గొన్నారు.