1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2016 (22:57 IST)

జ‌గ‌న్ దిష్టిబొమ్మ త‌గ‌ుల‌బెట్ట‌బోతే... త‌నకే అంటుకుంది... పాపం తెదేపా కార్పొరేటర్

విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ దిష్టిబొమ్మ త‌గ‌ుల‌బెట్ట‌బోయిన తెలుగు త‌మ్ముళ్ల‌కు విషాదం మిగిలింది. విజ‌య‌వాడలో ఒక కార్పొరేట‌ర్ ఒళ్ళు కాలి ఆసుప‌త్రి పాల‌య్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో తెలుగు తమ్మ

విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ దిష్టిబొమ్మ త‌గ‌ుల‌బెట్ట‌బోయిన తెలుగు త‌మ్ముళ్ల‌కు విషాదం మిగిలింది. విజ‌య‌వాడలో ఒక కార్పొరేట‌ర్ ఒళ్ళు కాలి ఆసుప‌త్రి పాల‌య్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో తెలుగు తమ్ముళ్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రి సెంటర్‌ వద్ద తెదేపా నేత గన్నె ప్రసాద్‌ నేతృత్వంలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తెదేపా కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు దుస్తులపై పెట్రోల్‌ పడి ఆయనకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆందోళనకారులంతా భయంతో పరుగులు తీశారు. 
 
కొందరు కార్యకర్తలు ధైర్యం చేసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో కార్పోరేటర్‌కు ఒళ్లంతా కాలిపోయింది. దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స‌రిగ్గా అగ్గిపెట్టె కాల్చే ముందు అడ్డుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఉల్టాగా తెలుగుదేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు.