ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఎమ్మెల్యేగా నా మొదటి జీతం నియోజకవర్గ ప్రజలకే.. గల్లా మాధవి (Video)

galla madhavi
టీడీపీకి చెందిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె మొదటి నెల జీతం నియోజవర్గ ప్రజలకే పంపిణీ చేస్తానని తెలిపారు. తనకు నెల వేతనంగా రూ.1,75,000 వచ్చిందనీ, ఈ మొత్తాన్ని ప్రజలకే పంపిణీ చేస్తానని తెలిపారు. ఈ మొత్తంలో రూ.20 వేలు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో వేయనున్నట్టు తెలిపారు. అలాగే, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీదు రూ.25 వేలు అన్న క్యాంటీన్లకు భోజనాలు సరఫరా చేస్తున్న అక్షయ పాత్రకు అందజేస్తామని తెలిపారు. 
 
నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క సచివాలయానికి పది మొక్కలకు తగ్గకుండా మొత్తం 10 వేల విలువైన మొక్కలను అందించడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న కొందరు సిబ్బందికి  రూ.10 వేలు అందిస్తామని తెలిపారు. ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు, నన్ను నమ్మిన లోకేశ్ అన్న, తనను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ పేర్ల మీదుగా రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైనవారికి దుప్పట్లు పంచే కార్యక్రమం రూ.10 వేలు కేటాయిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.