శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (11:17 IST)

గుడివాడకు 13 మంది చీర్‌గాళ్ళ్ ఎందుకు వచ్చారు.. సాక్ష్యాలు వెల్లడించిన వర్ల

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన కె- కన్వెన్షన్ సెంటరు గోవా క్యాసినో డ్యాన్స్‌కు వేదికైంది. ఈ క్యాసినోకు సంబంధించి అనేక ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, మంత్రి కొడాలి నాని మాత్రం అమ్మతోడు.. అలాంటిదేమీ లేదని బుకాయిస్తున్నారు. పైగా, ఎదురుదాడికి దిగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంటూ మీడియా ముందు రెచ్చిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గుడివాడ క్యాసినోకు సంబంధించిన పక్కా ఆధారాలను బహిర్గతం చేశారు. గోవా నుంచి గుడివాడకు 13 మంది చీర్‌గాళ్స్ వచ్చారని వర్ల వెల్లడించారు. వారిలో సంగీత, ఆస్ట్రాల్, అస్మిత, ప్రతిమ, శశికళ, అనుపమ, రమ, త్రిష సునీత, చండిక, పూనావతి, ఉజాలా, లక్ష్మి అనే అమ్మాయిలు గోవా నుంచి గుడివాడకు దిగుమతి చేశారని చెప్పారు. 
 
వీరంతా క్యాసినో ముగిసిన తర్వాత గుడివాడ నుంచి గన్నవరం అక్కడ నుంచి ఇండిగో విమానంలో బెంగుళూరు, అక్కడ నుంచి గోవా వెళ్లారని చెప్పారు. వీరందరికీ 98667 77771 అనే ఫోన్ నంబరులో టిక్కెట్లు బుక్ చేశారని చెప్పారు. ఈ విషయం ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తే తెలియదా? అని ప్రశ్నించారు. డీజీపీ గౌతం సవాంగ్ మాత్రం భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడుతారని వర్ల రామయ్య హెచ్చరించారు. 
 
అలాగే, మంత్రి కొడాలి నాని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గుడివాడలో క్యాసినో జరగలేదంటూ బుకాయిస్తున్నారన్నారు. క్యాసినో నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతం సవాంగ్‌లకు తెలియని విషయాలు తాను ఇంట్లో ఉండే తెలుసుకున్నానని వర్ల రామయ్య అన్నారు. మంత్రి కొడాలి నానికి ఏమాత్రం సిగ్గూశరం ఉన్నా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు.