ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 21 జనవరి 2022 (18:24 IST)

కేసినో క‌క్ష‌లు... గుడివాడ‌లో టీడీపీ వైసీసీ బాహాబాహీ!

మంత్రి కొడాలి నాని గుడివాడ‌లో త‌న క‌ల్యాణ మండ‌పంలో కాసినో నిర్వ‌హించార‌ని తెలుగుదేశం నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీసీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి వ‌ర్గ స‌మావేశం త‌ర్వాత ఘాటుగా స్పందించిన మంత్రి కొడాలి నాని, తాను కేసినో నిర్వ‌హించిన‌ట్లు నిరూపిస్తే, రాజీనామా చేస్తాన‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై నిజ‌నిద్ధార‌ణ‌కు టీడీపీ నేత‌లు గుడివాడ‌కు చేర‌డంతో గుడివాడ‌లో మంత్రి వ‌ర్గీయులు రెచ్చిపోయారు. 
 
 
గుడివాడలో తెలుగుదేశం కార్యాలయం పైకి  వైకాపా శ్రేణులు దూసుకొచ్చాయి. కొడాలి నాని వ‌ర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. వైకాపా శ్రేణుల‌ను తెలుగుదేశం నేతలు ప్ర‌తిఘ‌టించారు. దీనితో గుడివాడ ర‌ణ‌రంగంగా మారింది. తెదేపా నేతలను అరెస్టు చేసి, అనంతరం వైకాపా శ్రేణుల్ని రోడ్డుపైకి పోలీసులు వదిలార‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపించారు.