గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2016 (18:31 IST)

సైకో... పిచ్చి కుక్క... ఛీ... జ‌గ‌న్! : ఎమ్మెల్యే అనిత‌

పాయ‌క‌రావుపేట‌: ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా అధికార‌ప‌క్షాన్ని తాకిన‌ట్లున్నాయి. అంద‌రూ ఒక్క‌సారిగా జ‌గ‌న్ పై విరుచుకుప‌డుతున్నారు. ఎమ్మెల్యే అనిత అయితే, తిట్ట‌నితిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ప్రజా ఉప్ప

పాయ‌క‌రావుపేట‌: ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా అధికార‌ప‌క్షాన్ని తాకిన‌ట్లున్నాయి. అంద‌రూ ఒక్క‌సారిగా జ‌గ‌న్ పై విరుచుకుప‌డుతున్నారు. ఎమ్మెల్యే అనిత అయితే, తిట్ట‌నితిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ప్రజా ఉప్పెనలో ప్రతిపక్షనేత జగన్ మట్టికొట్టుకుపోతార‌ని పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు. 
 
జ‌గన్ మోహనరెడ్డి సైకోలా మాట్లాడుతున్నారని, అధికారపీఠం అనే పిచ్చికుక్క జగన్ మోహన్ రెడ్డిని కరవడంతోనే ఇలా మాట్లాడుతున్నాడ‌న్నారు. ప్ర‌తిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఛీ కొడుతున్నార‌ని, జ‌గ‌న్ వైఖ‌రి ఇలాగే ఉంటే... ప్రజలు రాళ్లతో కొట్టి వెలివేసే రోజులు వస్తాయ‌న్నారు.