సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (11:23 IST)

ఎంపీ కొడుకును టోల్ ఫీజు చెల్లించను!?... టోల్ ప్లాజ్ సిబ్బందిని చితక్కొట్టిన ఎంపీ తనయుడు

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్ ప్లాజా సిబ్బందిపై తన జులుం ప్రదర్శించాడు. కేవలం టోల్ ఫీజు చెల్లించేందుకు ఇష్టంలేక ఆయనతో పాటు ఆయన సహచరులు దాడికి దిగినట్టు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్ ప్లాజా సిబ్బందిపై తన జులుం ప్రదర్శించాడు. కేవలం టోల్ ఫీజు చెల్లించేందుకు ఇష్టంలేక ఆయనతో పాటు ఆయన సహచరులు దాడికి దిగినట్టు సమాచారం. ఈ దాడిలో టోల్ బూత్‌లోని కంప్యూటర్‌తో పాటు ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసమయ్యాయి. దీంతో రూ.3 లక్షల మేరకు నష్టంవాటిల్లింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సోమవారం ఉదయం అంబరీష్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు వాహనాల్లో గోరంట్ల నుంచి బెంగళూరుకు బయలుదేరారు. అంబరీష్‌ వాహనాలు (ఏపీ02 బీడీ1234, ఏపీ02ఈబీ6747) టోల్‌ప్లాజా పక్కనున్న రోడ్డులో వెళ్తుండగా టోల్‌ సిబ్బంది ఎంపీ స్టిక్కర్‌ ఉన్న వాహనాన్ని పంపి.. రెండో వాహనాన్ని నిలిపారు. టోల్‌ రుసుం చెల్లించి వెళ్లాలని కోరారు. ఇది ఎంపీ వాహనమని, టోల్‌ మినహాయింపు ఇవ్వాలని అంబరీష్‌ కోరగా.. సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అంబరీష్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. 
 
అదేసమయంలో అంబరీష్‌ ఫోన్ ద్వారా తన అనుచరులకు సమాచారం చేరవేశారు. వెంటనే అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి ఆయన అనుచరులు 20 మంది అక్కడకు చేరుకున్నారు. టోల్‌ సిబ్బందిపై దాడిచేసి సీసీ కెమెరాలు, అద్దాలు పగలగొట్టారు. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. ఈ వివాదంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.