గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (18:19 IST)

బ్లూ మీడియాలో ర‌క్త చ‌రిత్ర రాయించండి: లోకేష్

రాజ‌కీయంగా ఏ అవ‌కాశం వ‌చ్చినా విమ‌ర్శించ‌డానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  త‌యారైపోతున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. వై.ఎస్. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సిబిఐ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని హైద‌రాబాదులో అరెస్ట్ చేయ‌డంతో తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ దానిపైనా స్పందించారు. 

 
వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి బంధువు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవ‌డంతో మ‌రిన్ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయ‌ని లోకేష్ పేర్కొన్నారు. ద‌స్త‌గిరి వాంగ్మూలం ప్ర‌కారం గొడ్డ‌లిపోటు సూత్ర‌ధారి వైఎస్ అవినాశ్‌రెడ్డి. అవినాశ్‌రెడ్డిని ఈ కేసు నుంచి త‌ప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. 


సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌న్న‌ది వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి అని, దీని వెనుక అంత‌రార్ధం ఇదే కాబోలు అని యువ‌నేత ట్వీట్ చేశారు. బ్లూ మీడియాలో ఈ వైఎస్సాసుర ర‌క్త‌చ‌రిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారో? అంటూ వైసీపీ నేల‌త‌పై సెటైర్లు వేశారు నారా లోకేష్.