1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (10:40 IST)

రోడ్డుపై ప‌డుకున్నటీడీపీ నాయ‌కురాలు గుమ్మడి సంధ్యారాణి

విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నాయకురాలు గుమ్మ‌డి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకుని త‌న నిర‌స‌న తెలిపారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిరసనగా ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు సాలూరు టీడీపీ నాయ‌కులు రోడ్డ‌పైకి రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కాసేపు సాలూరు పోలీసుల‌కు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జ‌రిగింది.
 
నిర‌స‌న తెలిపే స్వాతంత్రం కూడా మాకు లేదా అంటూ సాలూరు నాయ‌కురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకున్నారు. ఆమెతోపాటు పలువురు మ‌హిళా నేత‌లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.పి.బంజ్ దేవ్ నిర‌స‌న తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల‌కు, నాయ‌కుల‌కు మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. 
 
సాలూరులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరను నిరసిస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన గుమ్మడి సంధ్యారాణిని వారించేస‌రికి పోలీసులు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. చివ‌రికి పోలీసులు బల‌వంతంగా సంధ్యారాణిని రోడ్డుపై నుంచి లేపి అదుపులోకి తీసుకున్నారు.