బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:27 IST)

టీడీపీ కార్యాలయాల విధ్వంసానికి కారణం ఈ మాటలే!

రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యవహారంతో పాటు గంజాయిసాగు, దానిరవాణాపై తెలుగుదేశంపార్టీ పెద్దఎత్తున ఉద్యమిస్తోందని, నిత్యంప్రభుత్వాన్ని, అధికారయంత్రాంగాన్ని నిలదీస్తోందని, మరీముఖ్యంగా టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ యువత మత్తుకు, మాదకద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలు నాశనంచేసుకుంటున్న తీరుపై తీవ్రంగా కలతచెందుతు న్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...!
 
మాదకద్రవ్యాలు, గంజాయి వ్యవహారంపై ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతో పాలకులుఇప్పటికే అనేకమంది టీడీపీనేతలకు నోటీసు లిచ్చారని, ఈ క్రమంలోనే నిన్న మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు గారికి కూడా పోలీసులునోటీసులిచ్చారు. ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో పోలీసులు గమనించారా? రాష్ట్ర యువత భవిష్యత్ నాశనమవుతోందని, రాష్ట్రంలో సాగుతున్న గంజాయిసాగు, రవాణాపై కేంద్రనిఘాసంస్థలు దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు.

అదేదో పెద్ద తప్పైనట్లు నిన్నఅర్థరాత్రి నర్సీపట్నం పోలీసులు నక్కాఆనంద్ బాబు గారిఇంటికి వెళ్లి మరీ నోటీసులిచ్చారు. నిన్నమధ్యాహ్నం 12గం - 12.30ని.ల మధ్య ఆయన విలేకరులతో మాట్లాడితే, రాత్రి 11 గంటలకు నర్సీ పట్నం పోలీసులు ఆయనింటికి వెళ్లారు. నిన్నమధ్యాహ్నం ఆయనేం మాట్లాడారో, తెలుసుకొని అవగాహనచేసుకోవడానికి  కొంత సమయం పడుతుంది. నిన్నమధ్యాహ్నం ఆనంద్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టాక,  నర్సీపట్నం నుంచి పోలీసులు గుంటూరుకు రావాలంటే కనీసం తక్కువలోతక్కువగా 7 నుంచి 8గంటల సమయం పడుతుంది.

కానీ నర్సీపట్నం పోలీసులు మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరి, పోలోమని ఎగేసుకొని నోటీసులివ్వ డానికి మాజీమంత్రి ఇంటికివచ్చేశారు.  ఆఘమేఘాలపై గుంటూరు వచ్చేసి రాత్రి 11 గంటలకల్లా పోలీసులు ఆనంద్ బాబు గారి ఇంటిముందు ప్రత్యక్షమయ్యారు. ప్రతిపక్షనేతలకు నోటీసు లివ్వడానికి పరుగునవచ్చిన నర్సీపట్నం పోలీసులు అదే మెరుపువేగంతో పక్కనే ఏజెన్సీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయి సాగుని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?

ఆడపిల్లలు, మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు,వారిని దారుణంగా హతమార్చినప్పుడు, దళితులపై దాడులుజరిగినప్పుడు ఏపీ పోలీసులు ఏనాడైనా ఇంతమెరుపువేగంతో స్పందించారా?  బాధ్యతగల మాజీమంత్రిగా, సీనియర్ రాజకీయనాయకుడిగా ఆనంద్ బాబుగారు ఏజెన్సీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి, దాని అక్రమరవాణాగురించి ప్రశ్నించి, ప్రజలు మరీముఖ్యంగా రాష్ట్రయువతఅప్రమత్తంగా ఉండాలనిచెబితే అదితప్పా?  దానికే నోటీసులివ్వడానికి నర్సీపట్నంపోలీసులు పరుగులుపెట్టుకుంటూ వస్తారా? 

ఏం నోటీసులిస్తారు... ఏమని ఇస్తారోచెప్పండి? తాడేపల్లి పాలేరు ఆడమన్నట్లు ఆడటమేనా నర్సీపట్నం పోలీసుల పని? రాష్ట్రప్రభు త్వం మాదకద్రవ్యాలను కట్టడిచేయాలని,  ఏపీ పోలీసులు అప్రమ త్తంగా ఉండాలని చెప్పడమే మాజీమంత్రి చేసిన తప్పా? నిన్నగాక మొన్న తెలంగాణ పోలీసులు  నల్గొండనుంచి విశాఖపట్నం ఏజెన్సీకి ఎందుకువచ్చారో చెప్పండి?

విశాఖఏజెన్సీలో సాగవు తున్న గంజాయిసాగుపై గుట్టుమట్లు పసిగట్టడానికి, గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన తెలంగాణ పోలీసులుపై ఇక్కడి గంజాయిస్మగ్లర్లు దాడికి తెగబడ్డారు. తాడేపల్లిలోని పెద పాలేరుకి నిజంగా దమ్ముంటే తెలంగాణ పోలీసులకు నోటిసులివ్వాలి. తమిళనాడు నుంచి నెల్లూరుకు వచ్చిన తమిళనాడు పోలీసులపై కూడా ఏపీలోని గంజాయి స్మగ్లర్లు బాంబులతో దాడికి తెగబడ్డారంటే అందుకు కారకులెవరు? ఎవరి అండదండలతో, ఎవరిచ్చిన ధైర్యంతో స్మగ్లర్లు, పోలీసులపైనే దాడులుచేస్తున్నారు?   

ఈ ముఖ్యమంత్రి అండదండలతోనే గంజాయిస్మగ్లర్లు పొరుగురాష్ట్రాలపోలీసులపై దాడులచేసే స్థాయికి బరితెగించారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యముంటే తమిళనాడు, తెలంగాణ పోలీసులకు నోటిసు లివ్వండి.. మారాష్ట్రంలోకి ఎందుకొచ్చారని వారిని నిలదీయండి? ఏపీకి చెందిన గంజాయి బెంగుళూరు, ఉత్తరప్రదేశ్ లోపట్టుబడింది. అక్కడి పోలీసులకు కూడా నోటిసులిస్తారా?

ఏపీనుంచి గుజరాత్ కు లిక్విడ్ గంజాయి రవాణా అవుతోందని, విశాఖనుంచి అది ఇతర రాష్ట్రాలకు  వెళుతోందని గుంటూరుఎస్పీ చెప్పారు.. ఏ ఆధారాలతో మాట్లాడాడో చెప్పమని, అతనికి కూడా నోటీసులివ్వం డి. తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకు చెబుతున్నా.. దమ్ముంటే తెలం గాణ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పోలీసులకు నోటీసులివ్వాలి. దద్దమ్మలాగా, చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న బోషడీకే... నీకు దమ్ముంటే, ఇతర రాష్ట్రాలపోలీసులకు నోటీసులివ్వు. నక్కాఆనంద్ బాబుగారికి నోటీ సులివ్వడంకాదు.

తాడేపల్లి పాలేరుకి, ప్యాలెస్ లోకూర్చొని ఆటలాడే పబ్జీ దొరకు నిజంగా దమ్ము, ధైర్యముంటే ఇతరరాష్ట్రాల పోలీసులకు నోటిసులివ్వాలి. చేతగాని దద్దమ్మల్లా టీడీపీవారికి నోటిసులివ్వ డం కాదు? తాడేపల్లి పెదపాలేరు... ఒక్కటి గుర్తుంచుకో. నువ్వేమీ తోపు... తురుమ్ ఖాన్ వికావు. నువ్వుఇచ్చే నోటీసులకు ఇక్కడ ఎవరూ భయపడరు? గంజాయి,  ఇతరమాదకద్రవ్యాల చలామణీ రవాణా గురించి నిత్యం ప్రభుత్వాన్ని, ఏపీపోలీసుల అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటాము.

నక్కాఆనంద్ బాబు గారు విద్యార్థి దశ నుంచే ఉద్యమబాటలో నడిచినవ్యక్తి, దళితజాతికోసం తనజీవితా న్నే పణంగా పెట్టిన గొప్పవాడు. అలాంటి వ్యక్తికి నోటీసులిస్తారా? తాడేపల్లి పాలేరులాగా ఆనంద్ బాబు గారు పిత్తపరిగలు ఏరుకునే రకం కాదు... ముందు ఆయన గురించి తెలుసుకోండి. 

రాష్ట్రయువత మత్తుపదార్థాలకు బానిసలు కాకూడదని, ఏపీ మాదకద్రవ్యాలకు అడ్డాకాకూడదని టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. వైసీపీనేతల పాత్ర, ప్రమేయంతోనే వారికి తెలిసే గంజాయి సాగు, రవాణా జరుగుతోందని జాతీయమీడియాలో రాశారు. ఆదీవాసీల ప్రతినిధులే అలాచెబుతున్నారు.. వైసీపీ నేతలే గంజాయిస్మగ్లర్లతో చేతులుకలిపి యథేచ్ఛగా దానిసాగు, రవాణాచేస్తున్నారని. దానిపై తాడేపల్లి పాలేరు ఏం చెబుతాడు?

టీడీపీనేతలు ఎవరు ఏదిమాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారు తప్ప,  తాడేపల్లి పాలేరులా, వైసీపీనేతల్లా గాలిపోగేసి గాలికబుర్లు చెప్పరు. ఉత్తరప్రదేశ్ , తెలంగాణ, తమిళనాడు పోలీసులు ఇచ్చినస్టేట్ మెంట్లను తాడేపల్లి పెదపాలేరు కాదనగలడా? తమిళనాడుపోలీసులపై నెల్లూరులోని గంజాయిస్మగ్లర్లు బాంబుల తో దాడిచేసిన దాన్ని కాదనగలడా?

ఇవేవీ పట్టించుకోకుండా, వీటిపై నోరెత్తకుండా టీడీపీనేతలకు, మాజీమంత్రులకు, దళితనేతలకు నోటీసులిస్తారా? తాముప్రశ్నించే వాటిలో ఏదినిజంకాదో తాడేపల్లి పాలేరు మీడియా ముందుకొచ్చి వాస్తవా లు మాట్లాడాలి. 
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పోలీస్ శాఖ మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్న పాలేరు గురించే మాట్లాడుతున్నాం.

పైస్థాయిలో ఉన్నకొందరు పోలీస్ అధికారులు ఎలా హద్దులుమీరి ప్రవర్తిస్తున్నారో దాన్నే తప్పుపడుతున్నాం. వాళ్లందరికీ సవాల్ చేస్తున్నాం... తాము అడిగేప్రశ్నలకు సమాధానంచెప్పాలి. అర్థరా త్రి వచ్చి గేట్లముందునిలబడి , ఖాకీ డ్రస్సువేసుకున్న దొంగల్లా తిరుగుతూ, నోటీసులివ్వడంకాదు.. నర్సీపట్నం పోలీసులకు దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకుసమాధానం చెప్పాలి. నర్సీ పట్నం ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని కట్టడిచేసే ధైర్యం లేదుగానీ, పోలోమని ఎగేసుకొని గుంటూరుకుమాత్రం వస్తారు.

ప్రభుత్వం, పోలీసులుఇచ్చే నోటీసులు మాకు చిత్తుకాగితాలతో సమానం. చంద్రబాబునాయుడుగారు రాష్ట్రయువత భవిష్యత్ కోసం వేలకోట్లరూపాయలపెట్టుబడులు, కంపెనీలు తీసుకొస్తే, ఈపనికిమాలిన ముఖ్యమంత్రేమో యువతను మత్తుపదార్థాలకు బానిసల్నిచేసి, వారిజీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే తాము వారిపక్షాన, వారిని రక్షించుకోవడానికి ప్రభుత్వంపై  ఉద్యమిస్తున్నాం, నిత్యం ఉద్యమిస్తూనే ఉంటాం. 

పోస్ట్ మెన్ ల్లాగా నోటీసులుపట్టుకొని వచ్చే కిందిస్థాయి పోలీస్ అధికారులు కూడా కొన్నివిషయాలు గుర్తుంచుకుంటే మంచిది. పైస్థాయిలో ఉన్న అధికారులు చెప్పారు కదాఅని, ఎగేసుకొని వస్తే భవిష్యత్ లో తాము తీసుకోబోయే చట్టపరమైన, న్యాయపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నాం.

పోలీసులు కూడా రాష్ట్ర యువత భవిష్యత్ గురించి ఆలోచిస్తేమంచిది. విశాఖ ఏజెన్సీ సహా రాష్ట్రంలో సాగవుతున్న కొన్నివేలఎకరాల గంజాయి సాగుపై పోలీసులు దృష్టిపెడితే మంచిది. తాడేపల్లి పాలేరుకి  నిజంగా దమ్ము, ధైర్యముంటే తెలంగాణ , తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాట క పోలీసులకు నోటిసులివ్వాలి.. అప్పుడు మాదగ్గరకొచ్చి మాట్లా డాలి. రాష్ట్రప్రజలు కూడా తాడేపల్లి బోషడీకే లత్కోరువ్యవహారాల ను గమనించి,  వారిబిడ్డలభవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలని, అవసరమైతే వారేనేరుగా ప్రభుత్వంపై  పోరాడాలని సూచిస్తున్నాం.