గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (19:17 IST)

ఆర్థిక మంత్రి బుగ్గనకు యనమల లేఖ.. జగన్ ఎంత అప్పు చేశారంటే?

yanamala ramakrishnudu
ఏపీ ఆర్ధిక వ్యవస్థపై టీడీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలుంటే.. 30 సంస్థల ఆడిట్ లెక్కలే చూపాయని కాగ్ స్వయంగా చెప్పిందని యనమల అన్నారు. 1.39 లక్షల కోట్ల మేర అప్పు చేస్తే నాడు ప్రతిపక్ష నేతగా జగన్ చాలా ఆందోళన చెందారు. 
 
జగన్ సీఎం అయ్యాక మూడేళ్లల్లోనే మూడింతల మేర రూ.3.25 లక్షల కోట్ల అప్పు చేశారని యనమల గుర్తు చేసారు. 
 
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాస్తూ ఈ విషయాలను అందులో పేర్కొన్నారు. మండలి ప్రతిపక్ష నేతగా తాను అడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను కోరారు.