గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (08:51 IST)

ఈటల రాజేందర్ చేరికపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికపై బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ  క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు ఖచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్‌కి ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారు. 
 
ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్.. ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల్లో ఏ తేదీన ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతాడనే దానిపై క్లారిటీ వస్తుందని రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. 
 
ఈటలకు హామీపై ఎలాంటి చర్చ జరగలేదని.. ఆయన ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు చేరాలి అనే దానిపై కేంద్ర బీజేపీ నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చింది.