గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (20:29 IST)

సమ్మె విరమించిన జూడాలు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో..?

తెలంగాణలో జూడాలు సమ్మె విరమించారు. తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 
 
తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి డిమాండ్లలో కీలకమైన వాటికి పచ్చజెండా ఊపింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి 80,500 వరకు పెంచింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతాయని పేర్కొంది. ఇక తాము, తమ కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూడాల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
వారి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాతో జూడాలు మరణిస్తే వారికి అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.