శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (15:44 IST)

డ్రగ్స్ కేసులో తెరాస మంత్రులు ఉన్నారా? అయితే వదిలిపెట్టొద్దు : కేసీఆర్

హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు.

హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. 'డ్రగ్స్' కేసు వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులైనా, మంత్రులైనా సరే ఉంటే వదిలిపెట్టవద్దని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దని చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరం డ్రగ్స్‌ కేంద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన డ్రగ్స్ దందా కూడా తాజాగా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 3గంటలపాటు జరిగిన ఈ భేటీలో డ్రగ్స్ రాకెట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. 
 
ముఖ్యంగా డ్రగ్స్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచాలని, అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులకు కనున ఈ వ్యవహారంతో సంబంధాలు ఉంటే  తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం, దందా ఎప్పటి నుంచో ఉన్నాయని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని, ఈ నగరం బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని కేసీఆర్ సూచించారు.