బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (19:14 IST)

అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్...

అమరావతిలో ఆంధ్ర సబ్ ఏరియా కమాండ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ  విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠతో ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస రావు చర్చించారు. 
 
సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంస్తులోని సీఎస్ చాంబర్‌లో సోమవారం సాయంత్రం మేజర్ జనరల్ సీఎస్‌ను కలిశారు. అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు, దాని విధివిధానాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ సమస్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మిలటరీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి అమరావతిలో పది ఎకరాల భూమి కేటాయించాలని మేజర్ జనరల్ శ్రీనివాస రావు సీఎస్ పునీఠని కోరారు.