ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (11:33 IST)

పసిపిల్లలా? పాలు తాగుతున్నారా? మాధవీలత ప్రశ్న

టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు.

టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు. శుక్రవారం ఉదయం బీజేపీలో చేరి.. తిరిగి సాయంత్రానికే అదే వేగంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోవడంపై మాధవీలత మండిపడ్డారు. అయినా దేనికోసం ఈ నాటకం అంటూ ప్రశ్నించారు.


నమ్మి ఘనంగా స్వాగతం చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారంటూ మండిపడ్డారు.  ఇలాంటివి చేయడం కాంగ్రెస్‌కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్‌కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదంటూ మాధవీ లత ఫేస్‌బుక్‌లో తెలిపారు. 
 
పొద్దున్నే మోదీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయిందని మాధవీ లత ఎద్దేవా చేశారు. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా, ఏమీ తెలియకపోవడానికి. పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీ లోకి అడుగువేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకునేందుకు బీజేపీలో చేరి.. ఆ సాయంత్రానికే ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చేరి చెప్పేశారా? అంటూ మాధవీ లత ప్రశ్నించారు.