గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (17:11 IST)

రాజస్థాన్‌లో బీజేపీ కేడర్ వీరంగం.. చిల్లర లేదన్నందుకు చితకబాదారు

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోష

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో కొందరు బీజేపీ నేత వీరేంద్ర సింగ్ రావత్ మద్యం కొనుగోలు చేయడానికి షాపుకు వచ్చాడు. అక్కడ రూ.2వేల నోటు ఇచ్చాడు. పెద్ద నోటుకు బదులు తక్కువ విలువగల నోట్లను ఇవ్వాల్సిందిగా షాపు సిబ్బంది అతన్ని కోరారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
కొద్దిసేపటి తర్వాత వీరేంద్రసింగ్ తన స్నేహితులతో వచ్చి షాపుపై దాడికి దిగాడు. విచక్షణారహితంగా అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఒకరి తర్వాత మరొకరు విరుచుకుపడ్డారు. గుంపుగా వచ్చిన రావత్ అనుచరులు షాపును ధ్వంసం చేశారు. 
 
తీవ్రంగా గాయపడిన సిబ్బంది స్పృహా కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.