మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:44 IST)

విమానంలో తమిళిసై సౌందరరాజన్‌కు ఆ అనుభవం..?

విమానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తూత్తుకుడి విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలోతమిళిసై సౌందరరాజన్‌కు వ్యతిరేకంగా ఓ యువతి నినాదాలు చేయడం ప్రస్త

విమానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తూత్తుకుడి విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలోతమిళిసై సౌందరరాజన్‌కు వ్యతిరేకంగా ఓ యువతి నినాదాలు చేయడం ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశమైంది. విమానంలో వుండగానే ఆమెను చూసిన ఓ మహిళ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన సౌందరరాజన్ ఆ యువతితో గొడవకు దిగారు. అది కాస్తా పెద్దది కావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పి పంపించారు. అనంతరం సౌందరరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోఫియా అనే ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి వెనక ఎవరో వుండి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయించారని ఆరోపించారు. 
 
సోఫియా బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ తనను అనుసరించిందని, ఆమె వెనక ఎవరో ఉండి ఇలా చేయించి ఉంటారని తమిళిసై అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ మహిళ ఆమె కనిపించలేదని.. ఏదో పార్టీకి చెందిన మహిళగానే ఆమెను భావించాల్సి వుందని తమిళిసై మీడియాతో అన్నారు. 
 
కాగా సోఫియా అరెస్టును తమిళ విపక్షాలు తప్పుబడుతున్నాయి. డీఎంకే చీఫ్ స్టాలిన్ సోఫియా అరెస్టును ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే ఓ మహిళను అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో సోఫియా అరెస్టుకు వ్యతిరేకంగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ట్విట్టర్లో బీజేపీకి వ్యతిరేక నినాదం ట్రెండ్ అయ్యింది. ఇంకా సోఫియా అనే పేరు ట్విట్టర్ ట్రెండ్స్‌లో స్థానం సంపాదించుకుంది.