శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (10:36 IST)

చాలా ముద్దొస్తున్నావ్... దగ్గరకు పిలిచి విద్యార్థినిని కౌగిలించుకున్న టీచర్...

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా 13 యేళ్ల విద్యార్థిని పట్ల ఓ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. చాలా ముద్దొస్తున్నావ్ అంటూ దగ్గరకు పిలిచి కౌగిలించుకుని బయటకు చెప్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా 13 యేళ్ల విద్యార్థిని పట్ల ఓ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. చాలా ముద్దొస్తున్నావ్ అంటూ దగ్గరకు పిలిచి కౌగిలించుకుని బయటకు చెప్పుకోలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం పెద్దదైంది.
 
హైదరాబాద్ బేగంపేట, పాటిగడ్డలో బండిమెట్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో బి.బాలకృష్ణ  అనే వ్యక్తి తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని(13) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచి చాలా ముద్దొస్తున్నావంటూ కౌగలించుకునేవాడు. 
 
దీంతో పాఠశాలకు వెళ్లేందుకు ఆ విద్యార్థిని భయపడుతూ వచ్చింది. కుమార్తెలోని మార్పును గమనించిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చి విషయమేంటని గట్టిగా నిలదీశారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు చేస్తున్న అసభ్య పనులను తెలిపింది. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆరా తీయగా ఆమె తోటి విద్యార్థినులూ బాలకృష్ణ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. 
 
అనంతరం తల్లిదండ్రులు కార్పొరేటర్‌ ఉప్పల తరుణి సహకారంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బాలకృష్ణపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నారు.