శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (12:39 IST)

చెల్లికి మద్యం తాగించి పదేళ్ల బాలికపై అన్న అత్యాచారం

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. పదేళ్ళ వయసున్న చెల్లికి మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధ అన్న. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. పదేళ్ళ వయసున్న చెల్లికి మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధ అన్న. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని పాలెం విహార్‌ కార్టర్‌పురి గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక మూడో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిపోవటంతో బాలిక తన చిన్న తమ్ముడితో కలిసి ఇంట్లో ఉంది. 
 
ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన బాలిక పెద్ద అన్నయ్య ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత తోడబుట్టిన చెల్లి అని చూడకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న బాలిక తమ్ముడు ఒక్క పరుగున బయటకు వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. 
 
ఆ వెంటనే బిగ్గరగా అరుస్తూ తన తల్లికి సమాచారం చేరవేశాడు. దీంతో భయానికి గురైన ఆ కీచకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లి పోలీసులకు సమాచరామివ్వటంతో వారు పరారీలో ఉన్న నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.