శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు.. ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు...

తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనగామ జిల్లా జాఫర్ గడ్‌లో ఉప్పుగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కేసోజు రాజేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని బలవంతంగా ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో అత్యాచార ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తానూ పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్‌ను పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.