శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:23 IST)

ఎమ్మెల్యే రోజాను అలా వదిలేయకండి సార్... ఎందుకని?

ఏంటిది.. రావు రమేష్‌ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుందిగా.. వాడినలా వదిలేయకండిరా.. ఆసుపత్రిలో చూపించండి.. అంటూ రావు రమేష్‌ చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్సయ్యింది. ప్రస్తుతం ఆ డైలాగ్‌నే కొంతమంది వాడేసుకుంటున్

ఏంటిది.. రావు రమేష్‌ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుందిగా.. వాడినలా వదిలేయకండిరా.. ఆసుపత్రిలో చూపించండి.. అంటూ రావు రమేష్‌ చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్సయ్యింది. ప్రస్తుతం ఆ డైలాగ్‌నే కొంతమంది వాడేసుకుంటున్నారు. ''వైసిపి ఎమ్మెల్యే రోజా మతిస్థిమితం కోల్పోయారు. దయచేసి ఆసుపత్రిలో చేర్పించుకోండి, రోజాకు అవసరమయ్యే ట్రీట్మెంట్ ప్రభుత్వం భరించడానికి సిద్థంగా ఉంది. ఆమెనలా వదిలేయవద్దు" అని వినూత్న రీతిలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు నిరసన తెలిపారు.
 
తిరుపతిలోని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చిన టిఎన్ఎస్ఎఫ్‌ నేతలు రోజాకు పిచ్చి పట్టింది.. ట్రీట్మెంట్ ఇవ్వండి.. ఆమెకు మీ ఆసుపత్రి అయితే సరిగ్గా సరిపోతుందని వేడుకొన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా చంద్రబాబు అభివృద్థి చేస్తుంటే రోజా మాత్రం ఏపీ హీన స్థితిలోకి వెళ్ళిపోయిందని చెబుతూ బాబు, నారా లోకేష్‌ లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టిఎన్ఎస్ఎఫ్‌ నేతలు ఇచ్చిన వినతిపత్రం తీసుకున్న సూపరింటెండెంట్ కాసేపు నవ్వుకున్నారు.