శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (10:11 IST)

గుంటూరులో 27 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు

గుంటూరు నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో నగరంలోని నార్త్‌క్లబ్‌ టెన్నిస్‌ కోర్టులలో నార్త్‌క్లబ్‌ ఇన్విటేషనల్‌ డబుల్స్‌ టెన్నిస్‌ పోటీలను ఈనెల 27, 28 తేదీలలో నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్‌ ఇన్‌చార్జి టీవీ రావు తెలిపారు.

టోర్నమెంట్‌ బ్రోచర్‌ను అవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 30+, 45+, 55+, 65+ కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

పోటీలలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అన్వర్‌, జాకీర్‌, రాము, సురేష్‌, కమల్‌, సాంబశివరావు, చంద్రశేఖర్‌, మూర్తి, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.