బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:46 IST)

12న మాచర్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాక

జాతీయ పతాకా ఆవిష్కరణకర్త పింగళి వెంకయ్య కుమార్తెను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మాచర్ల వస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, అయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీడియాకు తెలిపారు. 
 
మాచర్ల వాసి అయినా పింగళి కుమార్తె ఘంటసాల సీతారావమ్మాను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి మచర్ల వస్తున్నారని, అదే రోజు జాతీయ పతాకావిష్కరణగావించి నూరు వసంతాలు అయినా సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని పిన్నెల్లి సోదరులు తెలిపారు. 
 
ముఖ్యమంత్రి అయినా తర్వాత తొలిసారిగా మాచర్ల విచ్చేస్తున్నా వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికెందుకు పిన్నెల్లి సోదరులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్బంగా కోరారు.