1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (13:32 IST)

జయలలితే అయివుంటే పవన్ కాళ్లు చేతులు విరగ్గొట్టేది : టీజీ వెంకటేష్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీస్తూ ప్రసంగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనదైనశైలిలో మండిపడ్డారు. తమిళనాడులో ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి జయలలిత కాళ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీస్తూ ప్రసంగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనదైనశైలిలో మండిపడ్డారు. తమిళనాడులో ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించడం గెడ్డం గీసుకున్నంత ఈజీ కాదన్నారు.
 
పైగా, పవన్‌ కల్యాణ్‌ కుంభకర్ణుడిలా నిద్రపోయి ఆరు నెలలకోసారి నిద్రలేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు. త్వరలో చిరంజీవి రాజ్యసభ పదవికాలం ముగుస్తుందని, రాజీనామాలు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎంపీ టీజీ హితవు పలికారు.