అక్కచెల్లెమ్మల చిరునవ్వులు చూడటమే లక్ష్యం: కోన రఘుపతి
ప్రతి అక్కచెల్లెమ్మ మోముల్లో చిరు నవ్వులు చూడటమే లక్ష్యమని ఉపసభపతి కోన రఘుపతి అన్నారు. శుక్రవారం బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హల్ నందు స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాల చెక్కును అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోన కష్టాలు ఎన్ని ఉన్నా అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా 14 వందల కోట్లు సున్నా వడ్డీ కింద రుణాలు మంజూరు చేసిందన్నారు.
రాష్టంలో 8.7 లక్షల స్వయం సహయక సంఘాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయుతనిస్తున్నారని చెప్పారు.
రాష్టంలో ఆర్థిక లోటు ఉన్నప్పిటికి ఏ ఒక్క అక్కచెల్లెమ్మ కూడా ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కోట్ల రూపాయల రుణాలు సున్నా వడ్డీకే మంజూరు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తుందన్నారు.
తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తు పేదల మోముల్లో ఆనందం ను చూస్తున్నారని పేర్కొన్నారు.
కరోన వైరస్ నివారణకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజలందరు స్వచ్చందగా లాక్ డౌన్ లో ఉండాలని కోరారు.
నివేశాన స్థలాలు లేని మహిళలకు పక్క స్థలాలు అందజేసేందుకు ఇప్పటికే 105 ఎకరాల స్థలంను సేకరించి పెట్టమని త్వరలో అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్టంలో పేదలకు పక్క ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తున్న ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.