మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 20 మే 2021 (13:03 IST)

రేమిడేసివర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

కరోనా బాధితులకు సంజీవనిగా ఉన్న రేమిడేసివర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు  విక్రయిస్తున్న పది మంది సభ్యుల ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 ఇంజెక్షన్లను, ఒక లక్ష 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ వివరాలు వెల్లడించారు. ఆశ్రం ఆసుపత్రిలో కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది బయటి వ్యక్తుల సహకారంతో రేమిడేసివర్ ఇంజక్షన్లను నల్ల బజారు కు తరలించి వ్యవహరిస్తున్నారని సమాచారం అందిందన్నారు.

దీంతో ప్రత్యేక దృష్టి సారించి ఇంజెక్షన్లను విక్రయిస్తున్న పది మంది సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 42 ఇంజెక్షన్లను, 1 లక్ష 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.