సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:04 IST)

ప్రేమించలేదనీ పెట్రోల్ పోసి తగలబెట్టాడు...

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను యువతి ప్రేమించలేదన్న అక్కసుతో ఆ యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ దారుణం డిసెంబర్ 21వ తేదీన జరిగిం

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. ఓ  ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను యువతి ప్రేమించలేదన్న అక్కసుతో ఆ యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ దారుణం డిసెంబర్ 21వ తేదీన జరిగింది. 
 
ఆ యువతి రోడ్డుపై నడిచి వెళుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు ఉన్మాదిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. 
 
యువతి ఇచ్చిన సమాచారం మేరకు ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమోన్మాదిని కార్తీక్‌గాను, బాధితురాలి పేరు సంధ్యారాణిగా గుర్తించారు.