600 రోజుకు చేరనున్న రాజధాని ఉద్యమం
ఆదివారంతో 600 రోజుకు రాజధాని ఉద్యమం చేరనుంది. ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది.
హైకోర్టు దగ్గర ఉన్న జడ్జి క్వార్టర్ల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరగనుంది. మార్గమధ్యలో చర్చి, మసీదులను సైతం రైతులు సందర్శించనున్నారు. రాజకీయ వికృత క్రీడలో అమరావతిని బలిపీఠం ఎక్కించాలని సీఎం జగన్‌రెడ్డి చూస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం మూడు ముక్కల ఆట ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారే సంస్కృతికి చెక్ పెట్టాలని, లేదంటే ఇది ఇతర రాష్ట్రాలకు పాకి ప్రమాదకరంగా మారుతుందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి ధోరణి కారణంగా ఏ ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రావటం లేదన్నారు.