బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 8 జులై 2017 (14:27 IST)

జాతీయ జెండాను రివర్స్‌ ఎగిరేసిన కలెక్టర్...

ఒక జిల్లా కలెక్టరే జాతీయ జెండాను అవమానించారు. దేశసార్వభూమాధికారాన్ని ప్రజలందరికీ తెలియజేసే పోస్టులో ఉన్న కలెక్టరే జాతీయ జెండాను ఎలా ఎగురవేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. యోగాపై అవగాహన కల్పించడం కోసం తి

ఒక జిల్లా కలెక్టరే జాతీయ జెండాను అవమానించారు. దేశసార్వభూమాధికారాన్ని ప్రజలందరికీ తెలియజేసే పోస్టులో ఉన్న కలెక్టరే జాతీయ జెండాను ఎలా ఎగురవేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. యోగాపై అవగాహన కల్పించడం కోసం తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 
 
అయితే అది తలకిందులుగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. జెండా వందనం అయిన తర్వాతైనా సెల్యూట్ చేసే టైంలో కూడా జరిగిన తప్పిదాన్ని కలెక్టర్‌గానీ ఇతర ఉన్నతాధికారులుగానీ గుర్తించలేకపోయారు. దీంతో జాతీయజెండాను అలాగే తలకిందులుగా ఎగురవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కలెక్టర్.