శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (20:10 IST)

ఏపీలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440k వ్యాప్తిలో ఉంది, ఎవరు?

తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు జరిగింది. చర్చల అనంతరం క్రింది నిర్ణయాలు తీసుకోవడమైంది. ఏపీలో కొత్త కరోనా వేరియంట్ ఎన్ 440 వేగంగా వ్యాపిస్తున్నది. ఇది ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీన్ని సిసిఎంబీ శాస్త్రవేత్తలు తొలిగా కర్నూలులో కనుగొన్నారు.

ఇప్పటికే ఏపీలో 30 శాతం వ్యాప్తి చెందింది. బెడ్‌ల కొరత ఉందని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ అంగీకరించారు. వ్యాక్సినేషన్ కొరత, ఆక్సిజన్ కొరతతో ఇది విపత్తుగా మారుతోంది. ఇది మరింత తీవ్రస్థాయికి చేరడాన్ని అరికట్టాలంటే ఏపీలో లాక్ డౌన్ కు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రం 14 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. 

ఇతర రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కొరకు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయి. ఏపీ కూడా వెంటనే ఆర్డర్లు పెట్టాలి. మద్యం, ఇసుకలో తీసుకునే కమిషన్లు కరోనాకు మళ్లిస్తే నిధుల సమస్యరాదు. రంగుల కోసం రూ. 3000 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు. గోరంతల్ని కొండంతలుగా ప్రచారం చేసుకోవడానికి, గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి ఫుల్ పేజీ యాడ్స్ కోసం వందల కోట్లు దుబారా చేస్తున్నారు.

ఈ దుబారాను అరికట్టి కరోనా బాధితులకు ప్యాకేజ్ ఇవ్వాలి. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు సమయం వృథా చేయకుండా కరోనా నివారణపై దృష్టి కేంద్రీకరించాలి అంటూ తెదేపా నాయకులు అన్నారు.