అధికారుల నిర్లక్ష్యం, సచివాలయ ఫర్నిచర్‌పై పిల్లలు ఆటలు

Furniture
ఎం| Last Modified మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:21 IST)
కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 3న నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది టేబుళ్లను బయట పెట్టారు. ప్రమాణ స్వీకారం జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ ఫర్నిచర్‌ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు.

దీంతో పిల్లలు ఆడుకుంటూ టేబుల్‌లో ఉన్న విలువైన పేపర్లతో సహా ఆట వస్తువుల వలే ఆడుతున్న పరిస్థితి. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీలు వారి ఫర్నిచర్‌ని కూడా జాగ్రత్త పరచుకోలేని వీరు ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిస్థితిని చూసిన స్థానిక ప్రజలు అధికారుల బాధ్యత ఇదేనా అంటూ వారి నిర్లక్ష్య ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



దీనిపై మరింత చదవండి :