బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (09:54 IST)

మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు

చిత్తూరు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. గుర్రంకొండ మండలం తుమ్మలగొందికి చెందిన ఎం.స్వర్ణలతకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కు సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రి బయల్దేరారు.

అయితే, మార్గమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆస్పత్రిలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు చిన్నారులు, తల్లి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణ కాన్పులోనే ముగ్గురు చిన్నారులకు జన్మనివ్వడం విశేషమన్నారు.

స్వర్ణలత, శివకుమార్‌ దంపతలకు మొదటి కాన్పులో లాస్య (5), రెండో కాన్పులో ఉమశ్రీ (3) ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఓ బాబు, ఇద్దరు పాపలు జన్మించారు. మొత్తం ఐదుగురు సంతానం. సాధారణంగా మొదటి కాన్పులోనే ఇలా ముగ్గురు కవలలు జన్మిస్తారని, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం మాత్రం చాల అరుదని వైద్యులు చెప్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి కాన్పులు జరిగాయి. నలుగురు, ఐదుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెబుతున్నారు.