గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (03:51 IST)

బెంగళూరులో 470 మంది చిన్నారులకు కరోనా

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వీరంతా పదేళ్లలోపు వారే కావడం గమనార్హం.

ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు మహమ్మారి బారినపడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. గతంలో రోజుకు 8-9 మంది చిన్నారులు వైరస్ బారినపడే వారు. ఇప్పుడా సంఖ్య 46కు పెరిగింది.
 
గతంలో కాకుండా ఇప్పుడు చిన్నారులకు కూడా వైరస్ సంక్రమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నారని, వేడుకలకు హాజరవుతున్నారని, దీనికి తోడు స్కూల్స్ కూడా తిరిగి తెరుచుకోవడంతోనే వారు ఎక్కువగా దాని బారినపడుతున్నారని చెబుతున్నారు.

కానీ గతంలో లాక్‌డౌన్ కారణంగా చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారని, వైరస్ నుంచి వారిని అదే దూరంగా ఉంచిందని పేర్కొన్నారు.

కాబట్టి స్కూళ్లు మూసివేయాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ కోర్స్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు అన్నారు.