శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (03:47 IST)

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం రేపుతోంది. ఐఐఎంలో సుమారు 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కరోనా బారిన పడ్డారు.

25 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు సమాచారం. ఐఐఎం నిర్వహించిన పరీక్షల్లో 40 మంది కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వీరిని ఐసోలేషన్‌ ఉన్నారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు.

చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, గత ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుపుతున్నాయని అన్నారు. క్యాంపస్‌లో కొన్ని షరతులు విధించామని చెప్పారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు.