శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:52 IST)

30 రోజుల్లో ఒక వ్యక్తి నుంచి 406 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 12 రాష్ట్రాల అధికారులు, కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు.

మాస్కులు, సామాజిక దూరం లాంటి కరోనా నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన ఒక వ్యకి 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉందని హెచ్చరించారు. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయని, దేశంలోని 59.8 శాతం కేసులు ఈ జిల్లాల నుంచే వస్తున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

90 శాతం మరణాలు.. 45 ఏళ్లకు పైగా వయసున్న వారిలోనే సంభవిస్తున్నాయని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. మాస్కులపై 90 శాతం ప్రజలకు అవగాహన ఉన్నా 44 శాతం మందే ధరిస్తున్నారని, అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించాలని పేర్కొన్నారు.