గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (17:26 IST)

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

అసెంబ్లీ, సచివాలయాల్లో మీడియా కవరేజి చేసే 45 సంవత్సరాలు వయస్సు నిండిన మీడియా పత్రినిధులు అసెంబ్లీలోని రూమ్ నంబరు 205లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు. 
 
అసెంబ్లీ కార్యక్రమాలు కవరేజి చేసే శాశ్వత గుర్తింపు కార్డు కలిగిన మీడియా ప్రతినిధుల తోపాటు సచివాలయంలో జరిగే కార్యక్రమాలు కవర్ చేసే 45 సంవత్సరాలు నిండిన మీడియా ప్రతినిధులు ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 5గం.లలోపు వారి ఆధార్ కార్డు జిరాక్సును తీసుకుని వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.