తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 22వ తేదీకి వాయిదా పడ్డాయి. బడ్జెట్‌పై చర్చ ముగిసిన అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం, ఎలక్ర్టానిక్ తయారీ పరిశ్రమ, మైనార్టీలకు రుణ పథకం, నర్సంపేట్ – కొత్తగూడ రోడ్డు, టీఎస్ బీపాస్, బీపీఎల్ కుటుంబాలకు రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం జీరో అవర్ చేపట్టారు.
జీరో అవర్ ముగిసిన అనంతరం బడ్జెట్‌పై చర్చను స్పీకర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మోజమ్‌ఖాన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.