ఏంటి.. ఫోటోలు తీస్తున్నావ్.. ట్రాఫిక్ పోలీస్‌పై లారీ డ్రైవర్ దాడి
నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్‌లో డ్యూటీలు చేసే కానిస్టేబుల్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలను ఫోటోలు తీస్తుంటారు. హైదరాబాదులోనే ఇదే జరుగుతోంది. అయితే ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీశాడని.. ఓ లారీ డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం నార్సింగి చౌరస్తాలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ తన విధుల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్నారు. అదే క్రమంలో అటుగా వచ్చిన టిప్పర్‌ను ఆయన ఫోటో తీయడాన్ని డ్రైవర్ రఫీక్ గమనించాడు. అంతే టిప్పర్‌ను రోడ్డుపైనే ఆపేసి ఎందుకు ఫోటో తీస్తున్నావంటూ ప్రశ్నించాడు.
అది తన డ్యూటీ అని మల్లేశ్ చెప్పగా.. లారీడ్రైవర్ ఆవేశంతో ఊగిపోతూ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో కానిస్టేబుల్ వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ రఫీక్, యజమాని రమణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.