ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (20:15 IST)

మహారాష్ట్రలో కరోనా విజృంభణ

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల జిల్లా యంత్రాంగం 60 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించింది.

శనివారం ఉదయం 8 గంటల నుంచి 60 గంటలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుందని ఆ జిల్లా కలెక్టర్‌ ప్రేర్నా పేట్రియాట్‌ తెలిపారు. ఈ సమయంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా.. దుకాణాలు, మెడికల్‌షాపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆ జిల్లాలో గురువారం ఒక్కరోజే.. 251 మంది వైరస్‌ బారినపడగా.. నలుగురు మరణించారు. ముఖ్యంగా హోలీ పండుగ దృష్ట్యా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా జిల్లాల్లో నాలుగోరోజు కూడా 500కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. కాగా, ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధించగా.. తర్వాత కొంత సడలించారు.