సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (09:40 IST)

జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు: నటుడు పృథ్వి రాజ్

రాష్ట్ర ప్రజలకు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సినీ నటుడు పృధ్వి రాజ్ కొనియాడారు.

అన్ని వర్గాల ప్రజలకు ఏరాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలను సిఎం జగన్ అందిస్తు అత్యుత్తమ సిఎంగా నిలిచారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అవినీతిపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై సారించలేదని ఆరోపించారు.

కేవలం 20 నెలల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముదుస్వభావం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.