గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (11:33 IST)

జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం: నటుడు అలీ

విజ‌య‌వాడ‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్ధుల గెలుపును కాంక్షిస్తూ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ ఎన్నికల ప్రచారంలో  పాల్గొని మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ అని తెలిపారు. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. 

నాడు వైఎస్ పాలన చూశాం.. ఇప్పుడు జగన్ పాలనను చూస్తున్నాం అని అనందం వ్య‌క్తం చేశారు. అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే జగనన్న తపన అని వ్యాఖ్యానించారు.

విజయవాడ న‌గ‌రాభివృద్ధికి వంద‌ల కోట్ల రూపాయలు కేటాయించిన ఘ‌న‌త జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. రోడ్ షో అనంత‌రం భ‌వానీపురం ద‌‌ర్గాలో అలీ ఛాద‌ర్ స‌మ‌ర్పించారు.