సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:44 IST)

ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీఎస్‌, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఎన్నికలన్నీ వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. పరిశీలిస్తానని ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌ హామీ ఇచ్చారు. ముందు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు.. నగర పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమైంది.

22 లేదా 23 తేదీల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై న్యాయనిపుణులతో సంప్రదించాకే.. నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.