గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (12:46 IST)

రేపు క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం

ఈనెల 29వతేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభ అవార్డులు(School of Sports Excellence)ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు మరియు రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లాకు 5 పాఠశాలలు వంతున రాష్ట్రంలో 65 పాఠశాలలను రాష్ట్ర స్కూల్ గేమ్స్ “School of Sports Excellence”అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా జిల్లా కేంద్రాల్లో ఈక్రీడా ప్రతిభ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా స్థాయిలో మొదటి స్థానం  సాధించిన పాఠశాలకు 10వేల రూ.లు,ద్వితీయ స్థానం పొందిన పాఠశాలకు 8వేలు,తృతీయ స్థానం పొందిన పాఠశాలకు 6వేల రూ.లు,4వ స్థానానికి 4వేల రూ.లు,5వస్థానంలో నిలిచిన పాఠశాలకు 2వేల రూ.లు వంతున నగదు పురస్కారం  తోపాటు జ్ణాపిక,సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.