శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (11:23 IST)

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత... ఎందుకని..?

Visakha
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. అడ్మిన్ బిల్డింగ్‌ను ఉక్కు కార్మికులు ముట్టడించారు. 
 
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని.. వారు ఎందుకు వచ్చారు.. వారికి ఏమి చెప్పారో వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 
 
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్వంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్ ప్లాంట్ ఇండిపెండెంట్ డైరక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని చెప్పారు. 
 
అయినా ఒప్పుకోని కార్మికులు పరిపాలనా భవనంలోనికి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.