శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (17:40 IST)

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కార్మిక సంఘాలతో ఇవాళ‌ కార్మిక శాఖ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది. ప్లాంట్ యాజమాన్యం వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు
 
ఇక వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి స‌మ్మెకు వెళ్ల‌నున్న‌ట్టు మొద‌ట నోటీసులు ఇచ్చింది అఖిల‌ప‌క్షం. అయితే, ఆ త‌ర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి త‌ల‌పెట్టిన స‌మ్మెను వాయిదా వేస్తున్న‌ట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్ర‌క‌టించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.