మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (10:14 IST)

టిక్ టాక్ పిచ్చి.. బైక్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువతి

టిక్ టాక్‌ పిచ్చితో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. టిక్ టాక్ యాప్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి సోనికా కేతావత్‌ను బాగా తెలుసు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు, టిక్ టాక్ వీడియోలు సోనికాకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 
 
టిక్‌టాక్ యాప్‌లో సోనికాకు లక్షల సంఖ్యలో ఫాలో అయ్యే అభిమానులు ఉన్నారు. తన అందమైన హావభావాలతో చేసిన వీడియోలు సోనియాకు ఫ్యాన్స్ ఏర్పడేలా చేసాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సోనికాకు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ ఏ యాప్ ద్వారా సోనికా గుర్తింపు తెచ్చుకుందో అదే యాప్ కోసం వీడియో చేసే సమయంలో సోనికా ప్రాణాలు కోల్పోయింది.
 
సోనికా కేతావత్‌కు సినిమాల్లో కూడా నటించటానికి అవకాశాలొచ్చాయి. కానీ సోనికా ఎందుకో సినిమాల్లో నటించటానికి ఒప్పుకోలేదు. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమైన సోనికా బైక్ రైడింగ్ చేస్తూ వీడియో చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ రైడింగ్ చేసే సమయంలో వేగంగా వెళ్లిన సోనికా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిందని తెలుస్తోంది.
 
సోనికా శరీరంకు బలమైన గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సోనికా ప్రాణాలు కోల్పోయిందని సమాచారం. నల్గొండ జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సోనికాతో పాటు ఆమె స్నేహితుడు ఉన్నాడు. సోనికా స్నేహితునికి కూడా గాయాలు కావటంతో అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.