శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:24 IST)

ఏపీలో వ్యాపార సంస్థల‌ స‌మ‌యం కుదింపు

కరోనా ఉధృతి దృష్ట్యా నగరంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేప‌ధ్యంలో ఈ నెల 28 నుంచి వ్యాపార సంస్థలన్నీ మధ్యాహ్నం 2గంటల వరకే నిర్వహించాలని విజయవాడ చాంబర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమవారం గాంధీనగర్  ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు (షాపులు) పూర్తిగా తెరచి ఉంచి వ్యాపారం నిర్వహించుట శ్రేయస్కరం కాదన్నారు.

ప్రజల, వ్యాపారస్తులు, వివిధ సంఘాలు, ముఠా కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులు స్వియ నియంత్రణతో ఖచ్చితంగా షాపులు 2 గంటల వరకూ మాత్రమే తెరచి వుంచి వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు.

కరోనా వలన మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అందుచేత‌ వ్యాపారులు కరోనా నిబంధనలు తప్పక పాటించి నిర్ణీత సమయం వరకు మాత్రమే వ్యాపారాల‌ను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్సి పి.యస్.ఎల్.ఎన్.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.