విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శవాలపై శవాలు, కెపాసిటీ 50 ఐతే 81 కుక్కారు
విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు దారుణ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.
మృతదేహాలు ఖననంపై బంధువుల్లో నెలకొన్న ఆందోళనపై స్పందించారు మంత్రి ఆళ్ల నాని. 50 మృత దేహాలు పెట్టే వీలున్న గదిలో 81 మృతదేహాలు పెట్టడంపై విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్, RMO డాక్టర్ హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మంత్రి ఆళ్ల నాని.
రెండు రోజుల్లో 135 మంది చనిపోతే శుక్రవారం, శనివారం 80 మృత దేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు హాస్పిటల్ వైద్యులు. విజయవాడ కృష్ణలంకలో అంత్యక్రియల కోసం ఎక్కువ సమయం పట్టడం వల్ల అజిత్ సింగ్ నగర్‌లో మరో శ్మశానానికి ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు మంత్రి ఆళ్ల నాని.
6 మృతదేహాలు పట్టే రెండు ఫ్రీజర్స్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేసారు. కరోనాతో చనిపోయిన మృతదేహాలు వారి బంధువులు అంగీకారంతో కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని.
ఉచితంగా గ్యాస్ పైన కూడా మృతదేహాలు ఖననం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నానికి ఫోన్లో వివరించారు GGH సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్, RMO డాక్టర్ హనుమంతురావు. కరోనాతో మృతి చెoదిన వ్యక్తుల మృత దేహాలు ఎలాంటి ఆలస్యం లేకుండా కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని.
కరోనాతో మృత్యువాత పడ్డ వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి కృష్ణా జిల్లా DMHO డాక్టర్ సుహాసిని, గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్ సమన్వయముతో వ్యవహారించాలని సూచించారు మంత్రి ఆళ్ల నాని.
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం కరోనా మరణాలు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి దురదృష్టవశాత్తు చాలామంది మృత్యువాత పడటం విచారకరం అన్నారు. కరోనా మరణాలు జరగకుండా హాస్పిటల్స్ అన్ని రకాలుగా బాధితులకు వైద్యం అందిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.