వెంకన్న వద్ద రూ.20 కోట్ల ఓల్డ్ కరెన్సీ.. స్వామివారిని అరెస్టు చేస్తారా? భక్తుల సెటైర్లు
తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు
తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశిస్తుందా అంటూ భక్తులు సెటైర్లు వేసుకుంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దుతో పేదవాడు మొదలుకుని దేవుడి వరకు తీవ్రంగా నష్టపోయారు. దేవుళ్లలో ఎక్కువగా తిరుమల వెంకన్న నష్టపోయారు.
ఈ కోవలో రద్దైన నోట్లను ఇప్పటికీ భక్తులు స్వామివారి హుండీలో వేస్తుండటం అధికారులకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. దాదాపు రూ.20 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. పాత నోట్లను మార్చండి బాబూ అంటూ ఆర్బీఐని టీటీడీ కోరినా... రిజర్వ్ బ్యాంక్ అందుకు అంగీకరించలేదు. దీంతో, ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.